29-10-2024 01:09:30 AM
ఇద్దరు మృతి.. మరో ఇద్దరికి గాయాలు
ఇల్లెందు/ మంథని, అక్టోబర్ 28: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైన ఘట న భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండ లంలో చోటుచేసుకున్నది. బోడు ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకా రం.. భద్రుతండాకు చెందిన బానోత్ గణేశ్ (28) సోమవారం ఇల్లెందు మండలం పోలారం నుంచి మర్రి గూడెం మీదుగా నాయనమ్మతో కలి సి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు.
ఈక్రమంలో తోలెం రామయ్యగుంపు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఓ వ్యాన్ ఢీకొట్టింది. ఘటనలో గణేశ్ తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి నాయనమ్మకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఆమె ను ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు.
అలాగే పెద్దపల్లి జిల్లా మం థని మండలం అడవి సోమనపల్లికి చెందిన దంపతులు ద్విచక్రవాహ నంపై హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో వాహనాన్ని మరో వాహ నం ఢీకొట్టింది. ఘటనలో భార్య మృతిచెందింది. భర్తకు గాయాల య్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు ఓ ఆసుపత్రికి తరలించారు.