calender_icon.png 29 October, 2024 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైవర్ల నిర్ల్యక్షం వల్లే రోడ్డు ప్రమాదాలు

29-10-2024 02:27:56 AM

  1. ప్రమాదాల నివారణకు డ్రైవర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్
  2. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి తెలంగాణ రవాణాశాఖ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తుంద ని రవాణామంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. 2023లో దేశంలో లక్షా 73 వేల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోగా, ఇందులో 45 శాతం మం ది 35 ఏండ్ల లోపు యువతే అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం రవాణాశాఖ అధికారులు, స్వ చ్ఛంద సంస్థలతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల్లో 80 శాతం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయన్నారు. ప్రమాదాల నివారణకు డాక్టర్ గురువారెడ్డి సీఎస్‌ఆర్ ఫండ్స్ సహకారంతో కంపల్సరీ డ్రైవర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని రవాణా శాఖ నిర్ణయించింద న్నారు.

ఇందుకోసం మొదటిదశలో ప్రయోగాత్మకంగా ఉమ్మడి జిల్లాలో 9 కేంద్రాలు, హైదరాబాద్‌లోని ఆరు రవాణా శాఖ కేంద్రాల్లో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది రవాణాశాఖ అధికారులు పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలన్నారు. బీసీ స ంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, రవాణా శాఖ స్పెషల్ సె క్రటరీ వికాస్‌రాజ్, డిప్యూటీ సెక్రటరీ శోభారణి తదితరులు పాల్గొన్నారు.