భైంసా, జనవరి 2: రహదారులపై ప్రమాదాలు మానవ తప్పదాలతోనే చోటుచేసుకుంటున్నాయని భైంసా అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్‌పోస్ట్ ఎంవీఐ దూప్‌సింగ్ అన్నారు. భైంసా జాతీయ రహదారి తానూరు మండలం బెల్‌తరోడా చెక్‌పోస్ట్ వద్ద గురువారం జాతీయ రహదారి భద్రతా మారోత్సవాలను ప్రారంభించారు. మత్తు పదార్థాలు తీసుకుని, సెల్‌పోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపడంతోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించాలన్నారు.