calender_icon.png 28 April, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలి

28-04-2025 07:10:28 PM

జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించిన బీఆర్ఎస్ నాయకులు...

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని యాపల్ ప్రాంతంలో జాతీయ రహదారి 363 ను యాక్సిడెంట్ జోన్ గా ప్రకటించి, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పట్టణ నాయకులు ఎండీ అబ్బాస్ కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ... యాపల్ ప్రాంతంలోని ఐదు వార్దుల్లో సుమారు పదివేల జనాభా నివసిస్తున్నారని, యాపల్ ప్రాంతం నుండి బెల్లంపల్లి, మంచిర్యాలకు నిత్యం ప్రయాణాలు కొనసాగిస్తున్నారని, బెల్లంపల్లి వైపు వెళ్లే వారు బస్ లో వెళ్లాలంటే 363 జాతీయ రహదారి దాటాల్సిందేనని, రోడ్డు దాటే క్రమంలో ఇప్పటి వరకు ఆరుగురు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రమాదాల నివారణ కోసం జిల్లాలోని ఎన్ హెచ్ పిడిని కలిసి గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు 4 సార్లు వినతి పత్రాలు సమర్పించి నప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జాతీయ రహదారిపై రోడ్డు దాటేందుకు వీలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించి ప్రమాదాలను అరికట్టాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఎ సాంబమూర్తి, వి నర్సయ్య, ఎస్ సంతోష్, బివి రాజిరెడ్డి, జి రవివర్మ, ఎండి కరీం పాషా, ఎన్ శ్రీధర్, కే తిరుపతి, మజార్ లు పాల్గొన్నారు.