20-04-2025 09:10:31 AM
ప్రమాదం అనంతరం దగ్ధమైన బైక్.
యువకుడు మృతి.
నాగర్ కర్నూల్ విజయక్రాంతి: నాగర్ కర్నూలు జిల్లా వంగూర్ మండలం హైదరాబాద్.. శ్రీశైలం ప్రధాన రహదారిపై(Hyderabad-Srisailam Main Road) ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో అదుపుతప్పిన బైక్ నిప్పు రవ్వలు రాజుకొని దగ్ధమైంది. దీంతో వాహనదారుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం శ్రీశైలం ప్రధాన రహదారిపై వంగూర్ మండలం జీన్నింగ్ మిల్లు సమీపంలో చోటు చేసుకుంది.
ఎస్సై మాధవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ లోని మెహదీపట్నం(Mehdipatnam) ప్రాంతానికి చెందిన జుబేద్ (30), ఇమ్రాన్ ఇరువురు బైకుపై శ్రీశైలం వైపు వెళ్తున్నారు. అతివేగం కారణంగా బైకు అదుపుతప్పి రోడ్డు వెంట ఈడ్చుకుంటూ వెళ్లడంతో మంటలు చెలరేగాయి. వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా ద్విచక్ర వాహనం మంటల్లో దద్ధమైంది. జుబేద్ అక్కడికక్కడే మృతి చెందగా ఇమ్రాన్ తీవ్ర గాయాల పాలయ్యాడు వెంటనే అతన్ని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.