23-03-2025 10:46:32 PM
సంగారెడ్డి (విజయక్రాంతి): 65వ జాతీయ రహదారిపై పటాన్ చెరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆదివారం రాత్రి పటాన్ చెరు సమీపంలో ఉన్న ఓఆర్ఆర్ బ్రిడ్జి కింద స్కూటీని ఐరన్ లోడ్ తో వెళుతున్న లారీ ఢీకోనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్కూటీపై ప్రయాణిస్తున్న నాని అనే యువకుడు మృతి చెందాడు. సాయికి తీవ్ర గాయాలు, కావడంతో చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.