20-03-2025 10:19:58 AM
స్కూటీని ఢీకొట్టిన టిప్పర్ ఒకరు మృతి
పటాన్ చెరు: రామచంద్రపురం(Ramachandrapuram) లోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గురువారం ఉదయం స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని టిప్పర్ ఢీకోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. టిప్పర్ తీసుకోవడంతో స్కూటీపై వెళ్తున్న ప్రైవేటు పరిశ్రమలు పనిచేస్తున్న రవితేజ అక్కడికక్కడే మృతి చెందారు. జాతీయ రహదారి(National highway)పై రోడ్డు ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. ప్రమాదానికి కారణమైన టిప్పర్ ను పట్టుకొని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.