01-03-2025 12:00:00 AM
అతివేగంతో ట్రావెల్ బస్సును ఢీకొన్న రెండు కార్లు
ట్రాఫిక్ జాంతో భారీగా నిలిచిన వాహనాలు
పెబ్బేరు, పిబ్రవరి 28: పెబ్బేరు సమీపంలో ఉన్న 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం హైదరాబాద్ లోని ఎల్ బి నగర్ కు చెందిన వారు ట్రావెల్ బస్సులో తిరుపతిలో జరుగు పెళ్లి వేడుకకు బయలుదేరారు. కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లుతున్న హెరిటీగా, టాటా హెక్జా కార్లు అతివేగంతో వస్తూ సైడ్ డివైడర్ డికొని ఎదురుగా వస్తున్న పెళ్లి ట్రావెల్ బస్సును డీ కొన్నాయి. ఈ ఘటనలో ట్రావెల్ బస్సులో ప్రయాణం చేస్తున్న 45మంది ప్రయాణికులకు స్వల్ప గాయాల పాలైన్నారు. రెండు కారులో ప్రయాణం చేస్తున్న వారిలో ఒక కారులో పెబ్బేరుకు చెందిన ముష్టి విష్ణు (30) అక్కడిక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మృతుని భార్య విజయ ఇద్దరు కుమారులు, కుమార్తెకు తీవ్ర గాయలైనవి. మిగతా వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణం చేస్తున్న 30మంది గాయాలపాలైన క్షతగాత్రులను వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంతో జాతీయ రహదారిపై దాదాపుగా అర్ధ గంటకు పైగా కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జాంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.