calender_icon.png 26 February, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం...

25-02-2025 10:17:51 PM

గుర్తుతెలియని వాహనం ఢీకొని ముగ్గురు మృతి..

భార్య గర్భిణీ కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రమాదం..

మునిపల్లి: 65వ జాతీయ రహదారి బుదేరా చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మునిపల్లి మండలంలోని బుదేరా చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్డడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాద స్థలంలో మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారు మునిపల్లి మండలంలోని అంతారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

అంతారం గ్రామానికి చెందిన లచ్చమ్మ కుమారుడు రవి, భార్య శోభనతో కలిసి ఆసుపత్రికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. రవి భార్య శోభన గర్భిణీ కావడంతో తల్లి లచ్చమ్మ తో కలిసి సైకిల్ మోటార్ పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం సదాశివపేట ఆసుపత్రికి తరలించారు. ఓకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు మృతి చెందడంతో అంతారం గ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి.