calender_icon.png 19 April, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొల్లూరు ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం

15-04-2025 12:41:55 AM

- ఒకరు మృతి

- పది మందికి  తీవ్ర గాయాలు..ముగ్గరు పరిస్థితి సీరియస్

పటాన్ చెరు, ఏప్రిల్ 14 : కొల్లూరు ఓఆర్‌ఆ్ప ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పది మంది తీవ్ర గాయాలు అయ్యాయి. కొల్లూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు...కర్ణాటక రాష్ట్రం బీదర్ పట్టణానికి చెందిన ఒకే కుటుంబంలోని పన్నెండు మంది ట్రావెల్స్లో తిరుపతి వెళ్తున్నారు.

ఓఆర్‌ఆ్ప సోమవారం రాత్రి 2గంటల సమయంలో కొల్లూరు  నుంచి గచ్చిబౌలి వెళ్తున్న క్రమంలో  ముందు వెళ్తున్న వాహనాన్ని ట్రావెల్ వాహనం తప్పించబోయి కుడివైపు ఉన్న డివైడర్, కరెంటు పోల్ను బలంగా డీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కమ్ ఓనర్ మాదయ్య(42) అక్కడికక్కడే చనిపోయాడు. పన్నెండు మందిలో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ముగ్గిరి పరిస్థితి సీరియస్ గా ఉంది. చికిత్స కోసం  మాదాపూర్ హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.