calender_icon.png 11 January, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగిత్యాల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

10-01-2025 09:07:37 PM

జగిత్యాల: జగిత్యాల జిల్లా(Jagtial District)లోని తక్కళ్లపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా వచ్చి ఢీకొనగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు జగిత్యాల మండలం జాబితాపూర్ వాసులుగా, మరొకరు మేడిపల్లి మండలం కొండాపూర్ వాసిగా పొలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.