హైదరాబాద్: యాదగిరిగుట్ట నుంచి తిరిగి వస్తున్న ఓ కుటుంబంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి(Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Devastanam) ఆలయాన్ని సందర్శించి ఒక కుటుంబం తిరిగి వస్తుండగా భువనగిరి బైపాస్ సమీపంలో ఈ హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ పావని, ఆమె మూడేళ్ల కుమారుడు కన్నయ్య అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త జగన్, కుమార్తె సాత్విక గాయపడ్డారు. బాధితులు హైదరాబాద్(Hyderabad)లోని చంపాపేట్‌కు చెందినవారని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.