25-02-2025 02:20:25 AM
తెలంగాణకు చెందిన ముగ్గురు దుర్మరణం
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్/సంగారెడ్డి, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమా దంలో సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మం డలానికి చెందిన ముగ్గురు మృతి చెం దారు. న్యాల్‌కల్ మండలంలోని మామిడ్గి గ్రామానికి చెందిన వెంకట్ రాంరెడ్డి(42) జహీరాబాద్ నీటిపారుదల శాఖ కార్యాల యంలో డీఈగా పని చేస్తున్నారు. తన భార్య విలాసిని (40) తో కలిసి ప్రయాగ్‌రాజ్ కుంభమేళలో స్నానాలు ఆచరించారు. ఆది వారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో కాశీ విశ్వనాథుని దర్శనం కోసం కారులో వెళ్తుండగా వారణాసి సమీపంలో టిప్పర్ ఢీకోనడంతో వెంకట్‌రాంరెడ్డి, విలాసిని, కారు డ్రైవర్ మాల్లారెడ్డి (42) మృతి చెందారు.
మరో ముగ్గురికి తీవ్ర గాయ లుకాగా సమీపంలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. వెంకట్ రాంరెడ్డి కుటుంబం సంగారెడ్డి పట్టణంలోని జిమాక్స్ కాలనీలో నివాసం ఉంటున్నది. కాగా వీరి మృతిపట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు.