సిరిసిల్ల, (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కదురూపాకలో ఆగి ఉన్న లారీని కారు ఢీన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండికి చెందిన అశోక్, అలేహ్య, బాబు, మంగలు కారులో వస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన కరీంనగర్ కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన కారును తీసి ట్రాఫిక్ క్లియర్ చేశారు.