calender_icon.png 5 April, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

04-04-2025 08:17:16 AM

హుజురాబాద్,విజయక్రాంతి: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం(Huzurabad Mandal)లోని సింగపూర్ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ద్విచక్ర వాహనదారున్నీ గుర్తుతెలియని వాహనం ఢీకొడంతో ద్విచక్ర వాహనదారుడి తల నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సిఐ తిరుమల గౌడ్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.