హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా(Sangareddy District) గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతం సమీపంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో రిక్షా, కారును ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. తదుపరి విచారణ జరుగుతోంది, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.