12 మంది ప్రయాణికులు మృతి
జైపూర్, అక్టోబర్ 29: రాజస్థాన్‌లో మంగళవారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 12 మంది ప్రయాణికులు మరణించారు. సలాసర్ నుంచి వస్తున్న బస్సు సికర్ జిల్లాలోని లక్ష్మణ్‌ఘర్ వద్ద ఫ్లు ఓవర్ గోడను బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందుభాగం ఇనుప ముద్దగా మారిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించినట్లు జిల్లా ఎస్పీ భువన్ భూషణ్ యాదవ్ తెలిపారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను క్రేన్ సాయంతో బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డవారిని జైపూర్‌తోపాటు ఇతర ప్రాంతాల దవాఖానలకు తరలించినట్లు సికర్ ఐజీపీ సత్యేంద్ర సింగ్ వెల్లడించారు.