calender_icon.png 5 November, 2024 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

15-05-2024 10:48:57 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు సొంతవూరుకు వెళ్లి ట్రావెల్స్ బస్సులో తిరిగి హైదరాబాద్ కు వస్తున్న వాళ్లు మృత్యుఒడిలోకి చేరుకున్నారు. ఏపీ పల్నాడు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. టిప్పర్ ఢీకొని బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం కాగా, ఒకరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే చిలకటూరిపేటలోని ఆస్పత్రికి తరలించారు. 

హైదరాబాద్ వెళ్లెందుకు మంగళవారం రాత్రి  అరవింద ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో కలిసి బయలుదేరింది. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం- పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరిపాలెం రోడ్డు వద్దకు చేరుకోగానే అతివేగంతో దూసుకొచ్చిన టిప్పర్ బస్సును బలంగా ఢీకొట్టింది. మృతులను బాపట్ల జిల్లా నీలాయపాలెం వాసులుగా గుర్తించారు. మృతులను బస్సు డ్రైవర్ అంజి, మధ్యప్రదేశ్ కు చెందిన టిప్పర్ డ్రైవర్ హరిసింగ్, నీలాయపాలెంకు చెందిన కాశీ బ్రహ్మేశ్వరరావు (62), లక్ష్మి(52), శ్రీసాయి(09) గుర్తించారు.  స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.