calender_icon.png 9 January, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లమలలో ఘోర రోడ్డు ప్రమాదం..

04-08-2024 11:09:55 AM

చెట్టును ఢీకొన్న కారు ముగ్గురు మృతి 

మరొకరి పరిస్థితి విషమం

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): నల్లమలలోని శ్రీశైలం ఘాట్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈగలపెంట ఎస్సై వీరమల్లు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ బొల్లారం ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు కారులో శ్రీశైలం బయలుదేరారు. మన్ననూరు చెక్పోస్ట్ నుండి శనివారం రాత్రి బయలుదేరి నల్లమల అడవిలో ప్రయాణిస్తూ  తెల్లవారుజామున వటవర్లపల్లి దోమల పెంట గ్రామాల మధ్య ప్రాంతంలో అత్యంత వేగంగా కారు చెట్టును దిక్కుంది. దీంతో కార్ బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమించడంతో వెంటనే సున్నిపెంటలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను నియంత్రించారు.  మృతులంతా మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.