19-02-2025 11:48:10 AM
హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పానగల్ కొత్త ఫ్లైఓవర్(Panagal new flyover) పై అదుపుతప్పిన కంటైనర్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.