ఇద్దరు మృతి...
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): రెడీమిక్స్ టిప్పర్ లారీని వెనకనుంచి కారు వేగంగా ఢీకొన్న ఘటనలో ఇద్దరి యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండలం కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారి167 పై ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై సంషుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం... వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన గణేష్(28), తాండ్ర గ్రామానికి చెందిన కేతమళ్ల రామకోటి(35) గా గుర్తించినట్లు తెలిపారు. చారకొండ నుండి సొంత గ్రామమైన కొట్రకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.