calender_icon.png 15 March, 2025 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగాల్‌లో కారు బీభత్సం

14-03-2025 11:54:23 PM

ఆరుగురు మృతి.. 8 మందికి గాయాలు

నదియాలో చోటుచేసుకున్న ఘటన

వడోదరలో కారు ప్రమాదం.. మహిళ దుర్మరణం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో నదియా జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఛప్రా ఏరియాలో లక్ష్మిగిచ్చా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి తిరిగివస్తున్న ఈ ఎదురుగా వస్తున్న ఎస్‌యూవీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ఒకదాన్ని ఒకటి బలంగా గుద్దుకోవడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

వడోదర ప్రమాదంలో మహిళ మృతి

వడోదర : ఒక వ్యక్తి పీకల దాకా మద్యం తాగి కారు వేగంగా నడిపి ఒకరి ప్రాణం తీసిన ఘటన గుజరాత్‌లోని వడోదరలో జరిగింది. ఈ ప్రమాదంలో  మహిళ మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు బీభత్సం సృష్టించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. విషయంలోకి వెళితే.. గురువారం రాత్రి వడోదర సిటీలో అత్యంత రద్దీగా ఉండే కరేలీబాగ్‌లోని ఆమ్రపాలి చౌరస్తాలో ఒక బ్లాక్ కలర్ కారు అతి వేగంగా దూసుకొచ్చింది. అదుపు తప్పిన కారు పక్కనే ఉన్న టూ వీలర్స్‌ను గుద్దుకుంటూ వెళ్లింది. అంతటితో ఆగకుండా ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న హేమాలీబెన్ పటేల్‌పై కారు ఎక్కింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన వారిలో జైనీ (12), నిషాబెన్ (35), పదేళ్ల అమ్మాయితో పాటు 40 ఏళ్ల వ్యక్తి ఉన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించినప్పటికీ కారుకు నల్ల అద్దాలు ఉండడంతో నిందితుడు స్పష్టంగా కనబడలేదు. బ్లాక్ టీ షర్ట్ ధరించిన కారులోని వ్యక్తి ‘ఓం నమశిః వాయ’ అంటూ గట్టిగట్టిగా అరుస్తున్నట్లు వినిపించిందని స్థానికులు పేర్కొన్నారు. యాక్సిడెంట్‌పై స్పందించిన పోలీస్ జాయింట్ కమిషనర్ లీనా పాటిల్ కారును నడిపిన వ్యక్తిని మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డాడని.. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాలు లేదా డ్రగ్స్ ఏమైనా తీసుకొని కారును నడిపాడా అన్న కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.