calender_icon.png 21 April, 2025 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

21-04-2025 08:38:47 AM

హైదరాబాద్: మెదక్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) సంభవించింది. రెండు కార్లు ఢీకుని జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. దంపతులు అలీ(45), అజీబేగం(40), ఏడాది బాబుగా గుర్తించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం(Kowdipally Mandal) వెంకట్రావుపేట గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో చిన్నారులు సహా 9 మంది ప్రయాణిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.