09-02-2025 10:33:33 AM
డెడ్ బాడీ నుజ్జునుజ్జు
గుర్తు తెలియని వాహనం ఢీ
మెదక్,(విజయక్రాంతి): మెదక్ పట్టణ శివారులో గల వెంకటేశ్వర గార్డెన్స్(Venkateswara Gardens) సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వేకువ జామున చీకటి ఉండడంతో శవాన్ని గుర్తించని వాహనాదారులు పైనుంచి వాహనాలు వెళ్లడంతో వ్యక్తి డెడ్ బాడీ నుజ్జునుజ్జయింది. మెదక్ పట్టణం పతేనగర్ కు చెందిన అబ్దుల్ రహీంగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న హవేలీ ఘనపూర్ ఎస్సై(Haveli Ghanpur SI) సత్యనారాయణ బృందం దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.