మెదక్: మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజీపల్లి వద్ద సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు చిన్నారులతో సహ మరో ముగ్గురికి గాయలయ్యాయి. గమనించిన స్థానికులు, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారులోనుంచి మృతదేహన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనలో మృతి చెందినా మహిళ నవ్య(28)గా గుర్తించారు. కుటుంబంతో ఏడుపాయల వనదుర్గమాత దర్శనానికి కారులో వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.