calender_icon.png 5 November, 2024 | 1:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

03-11-2024 04:05:07 AM

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

చనిపోయినవారిలో ఇద్దరు చిన్నారులు 

పుట్టినరోజు వేళ విషాదం

మెదక్, నవంబర్ 2 (విజయక్రాంతి)/మనోహరాబాద్ : పుట్టిన రోజే తనకు చివరి రోజు అవుతుందని ఆ చిన్నారి ఊహించి ఉండకపోవచ్చు. తనతో పాటు అక్కను, తల్లిని, పెదనాన్నని రోడ్డు ప్రమాదం కబలించి వేస్తుందని అనుకోకపోవచ్చు. సం తోషంగా గడపాల్సిన సమయంలో విధి వక్రీకరించి ట్రాక్టర్ రూపంలో నలుగురిని బలితీసుకుంది. ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.  మనోహరాబాద్ మండ లం పోతారం గ్రామానికి చెందిన మన్నె ఆంజనేయులు (42), అతని తమ్ముడి భార్య లావణ్య (30), ఆమె ఇద్దరు కుమార్తెలు శాన్వి(9), సహస్ర (7) శనివారం పోతారం నుంచి శభాష్‌పల్లికి బయలుదేరారు.

సహస్ర పుట్టినరోజు కావడంతో శభాష్‌పల్లిలోని లావణ్య పుట్టింట్లో వేడుకలు జరుపుకోందామని అనుకున్నారు.  అయితే, సహస్ర తండ్రి కోళ్ల ఫాం లో పని ఉందని చెప్పడంతో, తన పెదనాన్న ఆంజనేయులు శభాష్‌పల్లిలో దిగబె డతానని బైక్‌పై తీసుకెళ్లాడు. కొంతదూరం వెళ్లాక శభాష్‌పల్లి రోడ్డుపై కొందరు రైతులు వరి ధాన్యం ఆరబెట్టడం, రోడ్డు ఇరుకుగా మారడంతో పాటు చీకటిగా ఉండడంతో ఎదురుగా వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఒక్కసారిగా బైక్‌ను ఢీకొట్టింది.

దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుప త్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యా ప్తు జరుపుతున్నారు. కాగా, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ధాన్యం కుప్పలే కారణం

పోతారం రహదారిపై కొందరు రైతులు ఒకవైపు వరి ధాన్యం కుప్పలను ఆరబెట్టారు. దీంతో మరోవైపు మాత్రమే వాహనాల రాకపోకలు సాగుతుండడంతో ఇరుకుగా మారింది. రాత్రి సమయం కావడం, ధాన్యం కుప్పలు సరిగా కనిపించకపోవడంతోనే వేగంగా వచ్చిన ట్రాక్టర్.. బైక్‌ను ఢీకొట్టిందని స్థానికులు భావిస్తున్నారు. రోడ్లపై ధాన్యం కుప్పలను ఆరబెట్టవద్దని నిబంధనలు ఉన్నా సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రివేళల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీనత వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.