10-02-2025 06:08:12 PM
ఒకరికి తీవ్రగాయాలు...
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని చొప్పాల పంచాయితీ మురికిమడు ప్రధాన రహదారిపై సోమవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బట్టుపల్లి గ్రామం చొప్పాల పంచాయతీ పరిధిలోని మురిమడు రహదారిపై ట్రాక్టర్, ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఖదీర్ అనే వ్యక్తికి తల పలిగింది. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ వాహనంలో కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం అదే 108 వాహనంలో మెరుగైన చికిత్స నిమిత్తం మణుగూరు వంద పడకల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.