calender_icon.png 20 September, 2024 | 5:24 AM

గోల్కొండలో డ్రంక్ అండ్ డ్రైవ్ కు ఐదేళ్ల చిన్నారి మృతి

03-08-2024 11:31:54 AM

హైదరాబాద్: ఎన్ని ట్రాఫిక్ రూల్స్ వచ్చిన కొందరూ ఇష్టానుసారంగా వాహనాలు నడిపి పక్కవారి ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా గోల్కొండ పరిధి ఇబ్రహీంబాగ్ లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కు చిన్నారి బలైపోయింది. రాంగ్ రూట్ లో  అతివేంగా దూసుకొచ్చిన కారు బైకును ఢీట్టింది. ఈప్రమాదంలో చిన్నారి మృతి చెందగా, తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. మద్యం మత్తులో కారు నడిపినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ చిన్నారి మరణానికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.