calender_icon.png 13 January, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం

13-01-2025 10:56:22 AM

తండ్రి కొడుకుల మృతి... మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

పండుగ పూట విషాదం 

పెద్దపల్లి,(విజయక్రాంతి): రామగుండం నియోజకవర్గంలోని  గోదావరిఖనిలోని మున్సిపల్ జంక్షన్ మెయిన్ చౌరస్తా రహదారిలోని వంక బెండు వద్ద సోమవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని చౌరస్తా వైపు వెళుతున్న కారు వెనుక వైపు నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్థానిక హనుమాన్ నగర్ కు చెందిన సింగరేణి కార్మికుడు సతీష్(33) అతని కుమారుడు 11 నెలల సాత్విక్ మృతి చెందారు. భార్యతో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన దవాఖాన కు తరలించారు.