calender_icon.png 30 April, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గద్వాలలో బొలేరో వాహనం బీభత్సం.. ఇద్దరు మృతి

29-04-2025 07:32:25 PM

గద్వాల: జోగులాంబ గద్వాల(Jogulamba Gadwal)లో మంగళవారం బొలేరో వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డుపక్కన బస్టాప్ లో నిలబడి ఉన్న విద్యార్థులపైకి బొలేరో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నర్సింగ్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురుకి తీవ్రగాయలయ్యాయి. ఘటన తర్వాత బొలేరో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం ఈ ఘటనపై మంత్రి దామోదర రాజనరసింహా(Minister Damodar Rajanarasimha) విచారం వ్యక్తం చేశారు. గద్వాల ఎమ్మెల్యే, కలెక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. మృతి చెందిన నర్సింగ్ విద్యార్థినుల పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని మంత్రి దామోదర రాజనరసింహా ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు మెరుగైనా వైద్య సహయం అందించాలని కలెక్టర్ కి మంత్రి ఆదేశించారు.