calender_icon.png 27 October, 2024 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలిలో ప్రమాదం.. కారులో ఇరుక్కున్న డ్రైవర్

27-10-2024 11:11:42 AM

గచ్చిబౌలి: హైదరాబాద్ గచ్చిబౌలి హెచ్ సీయూ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సును ఓవర్ టేక్ చేయబోయి ఆటోని ఢీకొని అదుపుతప్పి కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కారులో ఇరుక్కున్న డ్రైవర్ ను అతికష్టం మీద స్థానికులు బయటకు తీశారు. ప్రమాద సమయంలో కారులు ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నట్లు సమాచారం. డ్రైవర్ పరిస్థితి విషయంగా ఉండడంతో బీరంగూడలోని ఆస్పత్రికి తరలించారు. కారులో మద్యం సీసాలు లభ్యమయ్యాయి. మద్యం తాగి కారు నడిపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.