* 71 మంది మృతి
అడీస్ అబాబా, డిసెంబర్ 30: ఇథియోపియా దేశంలో ఘోర రోడ్డు ప్ర మాదం జరిగింది. ట్రక్కు అదుపుతప్పి నదిలో పడడంతో 71 మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు. దే శ రాజధాని అడీస్ అబాబాకు దక్షిణంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిడామా రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రయాణికులతో వెళుతున్న ట్రక్ అదుపుతప్పి బ్రిడ్జ్డిపై నుంచి నదిలోకి పడిపోయింది.
ఈ ఘటనలో 68 మంది పురుషులు, ముగ్గురు మహిళలు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు.
అయితే ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సోమవారం అధికారులు ప్రకటించారు. కాగా ప్రమాద సమయంలో ట్రక్‌లో ఎంతమంది ఉన్నారనే వివరాలను అధికారులు ప్రకటించలేదు.