calender_icon.png 3 February, 2025 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, 14 మందికి గాయాలు

03-02-2025 10:39:36 AM

అమరావతి: చిత్తూరు జిల్లా(Chittoor district) నగరి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా వేగంగా వచ్చిన లారీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు(Private travel bus)ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. తిరుపతి జిల్లా(Tirupati District) వడమలపేట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బాధితులు తమిళనాడులోని తిరుత్తణిలో ఓ వివాహానికి హాజరయ్యారు.

నగరి సమీపంలో వీరి బస్సు మరో వాహనాన్ని ఓవర్‌టేక్(Overtake) చేసేందుకు ప్రయత్నించగా, పుత్తూరు నుంచి వస్తున్న లారీ ఎదురుగా ఢీకొట్టింది. మృతుల్లో సీతారాంపురానికి చెందిన పార్థసారథి నాయుడు (70), రాజేంద్ర నాయుడు (65), తిరుపతికి చెందిన ధనుష్ (10), తిరుత్తణికి చెందిన కుమార్ (55) ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం నగరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంతో తిరుపతి-చెన్నై జాతీయ రహదారి(Tirupati-Chennai National Highway)పై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు దెబ్బతిన్న వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి సాధారణ ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.