తిరుపతి: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు(Chittoor town) పట్టణ శివార్లలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో బస్సులోని నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వేలూరులోని సిఎంసి ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదవశాత్తు బస్సు రోడ్డుపై నిలిచిన ట్రక్కును ఢీకొని 20 గజాల దూరం వరకు దూసుకెళ్లిందని పోలీసులు వెల్లడించారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన తర్వాతే బస్సు ఆగిపోయింది. అప్పటికే బస్సులో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(private travels bus) తిరుపతి నుంచి మధురై వెళ్తోంది. జిల్లా కలెక్టర్(District Collector) ప్రమాద స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష కోసం మార్చురీకి తరలించారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం నిర్లక్ష్యం, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు, వారి కుటుంబాలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.