మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల జాతీయ రహదారి పై సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ దగ్గర శుక్రవారం అర్ధరాత్రి కారు బోల్తా పడిన సంఘటన లో పదేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బెల్లంపల్లి కన్నాల బస్తీకి చెందిన పారుపల్లి రాజేష్ తన భార్య అలేఖ్య, కూతురు చిన్నారి సాయి మేఘనతో పాటు తన తల్లితో కలిసి భూపాలపల్లి లో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా అర్ధరాత్రి బైపాస్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో చిన్నారి సాయి మేఘన పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్ది నిమిషాల వ్యవధిలోని మృతి చెందింది. రాజేష్ తల్లి పరిస్థితి విషమంగా మారడంతో మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో పారిపల్లి రాజేష్, అతని భార్య అలేఖ్య తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారి సాయి మేఘన మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.