ద్విచక్ర వాహనాల పైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు..
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గత అర్ధరాత్రి రోడ్డుప్ర మాదం జరిగింది. పట్టణంలోని ఈద్గా వద్ద పాత జాతీయ రహదారిపై బైక్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు బోల్తా పడగా, బైక్ పై ప్రయాణిస్తున్న కుమ్ర శ్రీకాంత్, షేక్ సోహెల్ తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వారిని వెంటనే రిమ్స్ కు తరలించారు. ఈ ప్రమాదంలో కారు బోల్తా పడ్డ వెంటనే రోడ్డు పక్కనే ఉన్న ద్విచక్ర వాహనంపైకి కారు దూసుకెళ్లడంతో వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు కేసు నమోదు చేశారు.