నిలిచి ఉన్న లారీని ఢీకొని ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు..
ఆదిలాబాద్, (విజయక్రాంతి): దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రలోని కేలాపూర్ శ్రీ జగదంబ మాత దర్శనానికి వెళ్లిన పాదయాత్రలో విషాదం నెలకొంది. ఆదిలాబాద్ నుండి ద్విచక్ర వాహనంపై వెళ్లిన ఇద్దరు యువకులు హర్ష వర్షన్, నీరజ్ రెడ్డి లు అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఆదివారం తెల్లవారుజామున జైనథ్ మండలం పిప్పర్ వాడ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో హర్ష వర్షన్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, నీరజ్ రెడ్డి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని రిమ్స్ కు తరలించాగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.