ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం
జగిత్యాల, సెప్టెంబర్ 15 (విజయ క్రాంతి): జగిత్యాల జిల్లా పొలాస జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తాత, మనవరాలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లీపూర్‌కు చెందిన బండ్ల లచ్చయ్య (60) ఆదివారం మనవరాలు శ్రీనిధి (10), మనుమడు మల్లికార్జున్‌తో కలిసి స్కూటీపై వెళ్తున్నాడు. వాహనం పొలాస వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళ్తున్న ప్రైవేటు బస్సు కిందకు స్కూటీ దూసుకెళ్లింది. ఘటనలో లచ్చయ్య, శ్రీనిధి తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాల పాలై న మల్లికార్జున్‌ను స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. మల్లికార్జున్ పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. జగిత్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు.