calender_icon.png 27 December, 2024 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

03-11-2024 02:10:12 PM

ఒక్కరు మృతి మరొకరికి తీవ్రా గాయాలు

శేరిలింగంపల్లి, (విజయక్రాంతి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్రో స్టేషన్ వద్ద శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మాదాపూర్ లోని ఓ హాస్టల్లో ఉంటున్న గుంటూరుకు చెందిన ఇద్దరు స్నేహితులు గోపి(22), కార్తీక్(23) అర్ధ రాత్రి సమయంలో తమ ద్విచక్ర వాహనం పై లింగంపల్లి వైపు వెలుతూ మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద వేగంగా వచ్చి లారీని ఢీ కొన్నారు.

ఈ ప్రమాదంలో గోపి అక్కడికక్కడే మృతి చెందగా కార్తీక్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. మియాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన గోపి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. తీవ్ర గాయాల పాలైన కార్తీక్ ను ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. కాగా కార్తీక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు  వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.