బెల్లంపల్లి: (విజయక్రాంతి): బెల్లంపల్లి మధుర జంక్షన్(Mathura Junction) రహదారిపై గురువారం అర్థ్రరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంచిర్యాల వైపు నుండి అతివేగంగా వస్తున్న టీఎస్ 09 యుఈ 3055 నెంబర్ గల డీసీఎం మినీ వ్యాను, బెల్లంపల్లి(Bellampalle) వైపు యూటర్న్ తీసుకుంటున్న టీజి 19 1095 నెంబర్ గల కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం ముందుభాగం నుజ్జునుజ్జయింది. కారు ఎడమభాగం ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కారుతో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గామపడ్డారు. వీరిని స్థానికులు చికిత్స కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరుపై కాసిపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.