calender_icon.png 20 September, 2024 | 5:12 PM

యువతితో ఆర్‌ఎంపీ అసభ్య ప్రవర్తన!

19-09-2024 01:17:50 AM

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): జ్వరంతో తన వద్దకు వచ్చిన యువతి పట్ల ఆర్‌ఎంపీ అసభ్యంగా ప్రవర్తించాడు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలానికి చెందిన యువతి(23) జ్వరంతో బాధపడుతున్నది. తన తల్లి ఆమెను జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి ముందు ఉన్న ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లింది. ఆర్‌ఎంపీ యువతికి వైద్యం చేసే క్రమంలో అసభ్యంగా ప్రవర్తించాడని బాధితులు ఆరోపించారు. ప్రశ్నించగా వెంటనే అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది.