calender_icon.png 12 January, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఎంపీ వైద్యుడు అరెస్టు సిరిసిల్ల డీఎస్‌పీ చంద్రశేఖర్ రెడ్డి

30-12-2024 03:07:28 AM

-ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 29 : అరత లేకున్నా వైద్యం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండ లంలోని తుర్కాసి కాలనీ సముద్ర లింగా పూర్ గ్రామానికి చెందిన ఖాసింబి అనే మహిళకు శుక్రవారం  తెలిసి తెలియని వైద్యం చేసి మృతికి కారణమైన తిమ్మా పూర్ గ్రామానికి చెందిన ఆర్‌ఎంపి వైద్యు డు దేవేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు  తెలిపారు.

ఆర్‌ఎంపీ నిర్ల క్ష్యంవల్ల తన భార్య చనిపోయిందని మృతురాలి భర్త మహమ్మద్ అజీమ్  పోలీ స్‌స్టేషన్లో ఫిర్యాదు చేయగా, సీఐ. శ్రీనివాస్, ఎస్‌ఐ రామకాంత్ కేసు దర్యాప్తు చేసి ఆర్‌ఎంపి వైద్యుడిని అరెస్ట్ చేసి రిమాం డ్‌కి తరలించామన్నారు. అనారోగ్యంతో ఉన్న పుడు కనీస వైద్యం తెలియని ఆర్‌ఎం పీల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్ద ని, ప్రభుత్వ వైద్య సదుపాయాలు, అరత కలిగిన వైద్యలను మాత్రమే సంప్రదించాల న్నారు.

జిల్లాలో ఉన్న ఆర్‌ఎంపీలు లు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలే తప్ప క్లినిక్‌ల పేరుతో తెలిసి తెలియని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలు మీదకు తీసుకవస్తే చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డిఎస్పీ హెచ్చరించారు.