13-02-2025 12:00:00 AM
రాజేంద్రనగర్ (విజయక్రాంతి) ఫిబ్రవరి 12: శంషాబాద్ పట్టణంలోని కొత్వాల్ గూడ లో కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆర్‌ఎంసి ప్లాంట్లను రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. చాలాకాలంగా ఆర్‌ఎంసి ప్లాంట్ల నుంచి భారీగా కాలుష్యం వస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వీటిపై గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు కొరడా ఝలిపించారు. బుధవారం రెవెన్యూ అధికారులు 21 ఆర్‌ఎంసి ప్లాంట్లను సీజ్ చేశారు. తిరిగి కార్యకలాపాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఇష్టారాజ్యంగా ఆర్‌ఎంసి ప్లాంట్ లు నిర్వహిస్తున్న తీరుపై గతంలో విజయక్రాంతి ’అడ్డగోలుగా ఆర్‌ఎంసి ప్లాంట్లు’ శీర్షికతో కథనం ప్రచురించింది. ఈ పద్యంలో అప్పట్లో స్పందించిన తహసిల్దార్ రవీందర్ దత్ ఆర్‌ఎంసి ప్లాంట్ లో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. తాజాగా 21 ఆర్‌ఎంసి ప్లాంట్లను సీజ్ చేశారు.