మైహోం అవతార్ కూడలిలో స్థానికుల ఆందోళన
రాజేంద్రనగర్, నవంబర్ 23: ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారిని ఆర్‌ఎంసీ ప్లాంట్‌ను వెంటనే మూసివేయాలని మై హోం అవతార్, హాల్‌మార్క్ విసినియా నివాసులు ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు శనివారం నార్సింగి మున్సిపల్ పరిధిలోని మైహోం అవతార్ కూడలిలో సుమారు 15వేల మంది వరకు ఆందోళనకు దిగారు. ప్లాంట్ కారణంగా తాము దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు.
వీరికి బీజేపీ నేత తోకల శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి మద్దతు పలికారు. కార్యక్రమంలో బాధితులు.. గౌతమ్, శ్రీకాంత్, జైపాల్‌రెడ్డి, గోపాల్‌రావు, సుబ్బారెడ్డి, అశోక్, కవిత, రాధిక, కౌన్సిలర్లు.. పద్మారావు, నవీన్, మణికొండ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధనరాజ్, స్థానిక నాయకులు.. రూపారెడ్డి, ముత్తంగి లక్ష్మయ్య, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.