calender_icon.png 24 November, 2024 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఆర్‌ఎంసీ ప్లాంట్‌ను మూసివేయాలి’

11-10-2024 12:26:48 AM

రాజేంద్రనగర్, అక్టోబర్10: కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న ఆర్‌ఎంసీ ప్లాంట్‌ను అధికారులు వెంటనే మూసివేయాలని బీఆర్‌ఎస్ మణికొండ అధ్యక్షుడు సీతారం ధూళిపాళ్ల డిమాండ్ చేశారు. మణికొండ మున్సిపల్ పరిధిలోని మై హోం అవతార్ అపార్ట్‌మెంట్ వాసులు సుమారు 15వేల మంది సమీపంలో ఉన్న ఆర్‌ఎంసీ ప్లాంటుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీతారాం ధూళిపాళ్ల గురువారం బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ప్లాంట్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

ఆర్‌ఎంసీ ప్లాంట్ నుంచి విడుదలవుతున్న కాలుష్యంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. సమస్య పరిష్కరించమని అధికారులకు పలుమార్లు విన్న వించినా  పట్టించుకోవట్లేడని ధ్వజమెత్తారు. ప్లాంట్‌కు వచ్చీపోయే భారీ వాహనాలతో రోడ్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్లాంటు సమీపంలో ఉన్న భారీ పైపులైన్ నీరు ప్లాంట్ నుంచి విడుదలయ్యే రసాయనల వలన కలుషితమవుతుందని ఆరోపించారు.  ఆర్‌ఎంసీ ప్లాం ట్‌కు ఎలాంటి అనుమతులు లేవని ఆరోపించారు. అధికారులు పట్టించుకోకపోతే అపా ర్ట్‌మెంట్‌వాసులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.  కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు ధనరాజ్, లక్ష్మణరావు, ఉపేంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.