calender_icon.png 26 November, 2024 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌జే వెంచర్స్ నిర్వాహకుల అరెస్టు

26-11-2024 03:44:24 AM

ప్రీలాంచ్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన దంపతులు

200 మంది బాధితుల నుంచి రూ.48 కోట్ల వసూలు

కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): ప్రీ లాంచింగ్ ఆఫర్లతో ప్రజలను నిండాముంచిన ఆర్‌జే వెంచర్స్ (ఆర్ హోమ్స్ ఇన్‌ఫ్రా డెవలపర్స్) రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్ చక్క భాస్కర్, ఆయన భార్య ఎండీ చక్క సుధారాణిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ డీసీపీ ప్రసా ద్ తెలిపారు. బాధితుడు కొంపల్లి ప్రాంతానికి చెందిన వడ్లమూడి మనోజ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు.. సోమవారం నిందితులను అరెస్ట్ చేశారు.

కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ వెల్లడించారు. కాగా, ‘ఆర్‌జే వెంచర్స్’ తక్కువ ధరకు అపార్ట్‌మెంట్లు, ఫార్మ్ ల్యాండ్ ఇస్తామని నమ్మించి సుమారు 200 మంది బాధితుల నుంచి రూ.48 కోట్ల మేర వసూ లు చేసింది. పెట్టుబడులు పెట్టి ఏళ్లు గడుస్తు న్నా ఎలాంటి అపార్ట్‌మెంట్లు, ఫార్మ్ ల్యాం డ్స్ ఇవ్వకపోవడంతో బాధితులంతా శుక్రవా రం సైబరాబాద్ (ఆర్థిక నేర విభాగం) ఈఓడబ్ల్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

మార్కెట్ ధర కంటే తక్కువకే అంటూ..

ఆర్‌జే వెంచర్స్ చైర్మన్ భాస్కర్ గుప్తా

ర్య సంస్థ ఎండీ సుధారాణి కలిసి 2020 సంవత్సరంలో నారాయణ్ ఖేడ్, ఘట్‌కేసర్, పటాన్‌చెరు, కర్తనుర్ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు, ఫార్మ్ ల్యాండ్స్ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు విక్రయిస్తామని ఆఫర్లను ప్రకటించింది. ప్రజలను ఆకర్షించడానికి మ్యూజిక్ డైరెక్టర్ కోటి, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ వంటి ప్రముఖులతో ప్రచారాలు నిర్వహించింది. ఇదంతా నిజమేనని నమ్మిన సుమారు 200 మంది బాధితులు ఒక్కొక్క రు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వర కు పెట్టుబడులు పెట్టారు. రెండేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి ఇస్తామని, ఒకవేళ ఆలస్యం జరిగితే ప్రతీనెల అద్దె కూడా చెల్లిస్తామని కస్టమర్లను నమ్మించింది. ఇలా మొత్తం రూ.48 కోట్ల వరకు  సంస్థ నిర్వాహకులు వసూలు చేశారు. అపార్ట్‌మెంట్ నిర్మాణాలు చేపట్టడా నికి హెచ్‌ఎండీఏ అనుమతుల కోసం సమ యం పడుతుందని కొద్ది కాలం, ఆ తర్వాత ధరణిలో ఇబ్బందులు ఎదురయ్యాయని మరికొంతకాలం వెల్లదీస్తూ వచ్చారు. పెట్టుబడులు పెట్టి నాలుగు సంవత్సరాలు గడు స్తున్న ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంపై అనుమానం వచ్చిన కొందరు ఆర్‌జే వెంచర్స్ నిర్వాహకులను నిలదీశారు. తమ డబ్బు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే సంస్థ నిర్వాహకులు  నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం.. గట్టిగా నిలదీస్తే చెక్కు లు ఇస్తుండగా.. అవి కూడా బౌన్స్ అవ్వడం తో బాధితులంతా కలిసి జరిగిన విషయమై సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.