పాకిస్థాన్, విండీస్ తొలి టెస్టు
ముల్తాన్: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో ఆతిథ్య పాకిస్థాన్ తొలిరోజే కష్టాల్లో పడింది. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ 41.3 ఓవర్లలో 143 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ (51*), సాద్ షకీల్ (56*) క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ షాన్ మసూద్ (11), ముహమ్మద్ (6) తక్కువ స్కోర్లకే వెనుదిరగ్గా.. వన్‌డౌన్‌లో వచ్చిన బాబర్ ఆజం (8) విఫలమయ్యాడు. అయితే మిడిలార్డర్‌లో సాద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రోజును ముగించారు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 97 పరుగులు జోడించారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ 3 వికెట్లు పడగొట్టగా.. గుదకేశ్ మోతీ ఒక వికెట్ తీశాడు.