19-02-2025 07:51:21 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బిజెపి దళపతిగా ఖానాపూర్ నియోజవర్గం చెందిన రితీష్ రాథోడ్ నియమితులయ్యారు. మాజీ ఎంపీ స్వర్గీయ రమేష్ రాథోడ్ కుమారుడైన రితేష్ రాథోడ్ 2020లో రాథోడ్ తో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరారు. బీటెక్ చదివిన ఈయన తండ్రి రాజకీయాలను అనుసరిస్తూ ప్రజల్లో సేవ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన రితీష్ రాథోడ్ ఓడిపోయినప్పటికీ ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
2020లో బిజెపిలో చేరిన ఆయనకు రాష్ట్ర కార్యవర్గంలో స్థానం దక్కడంతో బండి సంజయ్ నిర్వహించిన పాదయాత్రలో చురుకుగా పాల్గొనడంతో ఆయన ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుల ఆయనకు పార్టీ అధిష్టానం అవకాశం కల్పించడంతో కమల దళపతిగా నిర్మల్ జిల్లాను స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో ఎంపీ సహకారంతో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. తనకు పదవి ఇప్పించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన రాథోడ్ నిర్మల్ లో మహేశ్వర్ రెడ్డిని కలిశారు.