calender_icon.png 17 January, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్తా చాటిన రితిక

07-07-2024 12:20:14 AM

హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: హుస్సేన్ సాగర్ వేదికగా జరుగుతున్న 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీల్లో రితిక దంగి మరోసారి సత్తా చాటింది. నాలుగో రోజైన శనివారం ఐఎల్‌సీఏ మహిళల విభాగంలో 10, 11, 12వ రేసుల్లో రితిక అగ్రస్థానంలో నిలిచింది. ఐఎల్‌సీఏ ఓపెన్ కేటగిరీలో బిక్రమ్ మహాపాత్ర రెండు రేసుల్లో అగ్రస్థానం దక్కించుకోగా.. మరో రేసులో రితిక సత్తా చాటింది.  ఐఎల్‌సీఏ బాలికల విభాగంలో షగున్ ఝా రెండు రేసుల్లో తొలి స్థానంలో నిలవగా.. మాన్య రెడ్డి మరో రేసులో అగ్రస్థానం నిలబెట్టుకుంది. ఐఎల్‌సీఏ బాలుర కేటగిరీలో శశాంక్ బత్తం, ఏకలవ్య బత్తం, అక్షత్‌కుమార్‌లు ముందంజ వేశారు.