calender_icon.png 19 January, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్స్‌లో రితికా ఓటమి

11-08-2024 02:07:12 AM

రెజ్లింగ్‌లో ముగిసిన భారత్ పోరాటం

పారిస్: ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ల పోరాటం ముగిసింది. మహిళల ఫ్రీస్టుల్ 76 కేజీల విభాగంలో రితికా హుడా క్వార్టర్స్‌లో పరాజ యం చవిచూసింది. శనివారం జరిగిన క్వార్టర్స్‌లో రితికా 1 కిర్గిస్థాన్ రెజ్లర్ టాప్ సీడ్ ఐపెరి మెడెట్ కిజీ చేతిలో ఓటమిపాలైంది. తొలి బౌట్‌లో 1 ఆధిక్యం కనబరిచిన రితికా ఆ తర్వాత అదే దూకుడు కొనసాగించడంలో విఫలమైంది. ఆరు నిమిషాల బౌట్ ముగిసేసరికి ఇద్దరు 1 సమంగా ఉన్నారు. దీంతో రిఫరీ మ్యాచ్‌లో ఎక్కువసేపు పట్టు నిలుపుకున్న ఐపెరిని విజేతగా నిర్ణయించారు.

అయితే ఐపెరి సెమీస్‌లో ఓటమి పాలవ్వడంతో రితికా రెపిచేజ్ ఆశలు కూడా గల్లంతయ్యాయి. అంతకముందు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో రితికా అదరగొట్టింది. హంగేరీకి చెందిన నగీపై 2 రితికా ఘన విజయం సాధించి కార్టర్స్‌లో అడుగుపెట్టింది. రితికా ఓటమితో ఈసారి ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో భారత్ కేవలం ఒక్క పతకానికే పరిమితమైంది.